
సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం పన్ను అధికారులు మరియు సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించారు.
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్యులను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని ఆమె అధికారులకు సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పరిపాలనా విధానాలను సరళీకరించాలని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.