
ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అశ్లీల ప్రకటనల ద్వారా హానికరమైన ఆండ్రాయిడ్ యాప్స్‌ను ప్రచారం చేస్తూ సైబర్ నేరగాళ్లు భారీ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది.
నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) ప్రకారం, యూజర్లు '.live' డొమైన్ వెబ్సైట్ల నుంచి APK ఫైల్స్ డౌన్లోడ్ చేయగానే ఫోన్ డేటా హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్తోంది.
ఈ మాల్వేర్ యాప్స్ ఫోన్లోని 'యాక్సెసిబిలిటీ' పర్మిషన్లను పొంది, యూజర్ల అనుమతి లేకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ ఆర్థిక లావాదేవీలను దొంగిలిస్తున్నాయి.