
రాకెట్ల తయారీ, ఉపగ్రహాల నిర్మాణం ప్రైవేటు రంగానికి బదిలీ కావడంపై ఇస్రోకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ 4న ఛైర్మన్ నారాయణన్‌కు లేఖ రాశాయి.
ఇప్పటికే 120 సాంకేతికతలను ప్రైవేటు రంగానికి బదిలీ చేశామని, భవిష్యత్తులో PSLV, LVM3 తయారీ కూడా ప్రైవేటుకు వెళ్లే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రైవేటు భాగస్వామ్యంపై స్పష్టమైన విధానం లేకపోవడంతో ఉద్యోగ భద్రత, ప్రమోషన్లపై అధికారిక వివరణ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.