
ఇరాన్తో యుద్ధాన్ని ముగించే మార్గం తెలియక సతమతమవుతున్న అమెరికా, ఇరాన్పై భారీ దాడులకు దిగే యోచనలో ఉంది.
అమెరికా వద్ద ఉన్న సంప్రదాయక బాంబుల్లో అత్యంత శక్తిమంతమైన జీబీయూ-43/బీ ఎమ్ఓఏబీని ప్రయోగించాలని భావిస్తోంది.
అయితే ఈ బాంబుతో భూగర్భంలో ఉన్న ఇరాన్ అణు వసతులను చేధించడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.