
భారత్-అమెరికా మధ్య ఏడాదికి పైగా సాగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలు తుది దశకు చేరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, తాము భారత్‌తో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం భారత్ పర్యటనలో ఈ ఒప్పందం తుది దశకు చేరుకుందని పేర్కొన్నారు.