
సౌదీ అరేబియాలోని మదీనాలో భారీ స్థాయిలో యురేనియం మరియు రేర్ ఎర్త్ మెటల్స్ నిల్వలను కనుగొన్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
మదీనాలోని 'జబల్ సయీద్' ప్రాజెక్టు వద్ద చేపట్టిన భౌగోళిక అధ్యయనాల్లో సుమారు 110 మిలియన్ టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నట్లు తేలింది.
చమురు ఆధారిత ఆర్థిక రంగాన్ని వైవిధ్యీకరించే విజన్ 2030లో భాగంగా సౌదీ అరేబియా తన ఇంధన వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టింది.