మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా పేరున్న పరాగ్ షా ముంబై వీధుల్లో బిక్షాటన దీక్ష చేపట్టారు.
జైన సంప్రదాయంలోని ఒక ప్రత్యేక మాసంలో ఆధ్యాత్మిక గురువు మార్గదర్శనంలో ఆయన ఈ దీక్షను పూర్తి చేశారు.
సమాజంలో హోదా, అహంకారాన్ని పక్కనబెట్టి సాధారణ మానవుడిగా జీవిత సత్యాలను అనుభవించేందుకు ఈ దీక్ష చేసినట్లు ఆయన తెలిపారు.