
హెచ్ఐవీ వ్యాప్తిని అడ్డుకునే లేనాకాపవిర్ ఇంజెక్షన్ ను దేశీయంగా ఉత్పత్తి చేసి విక్రయించేందుకు డాక్టర్ రెడ్డీస్, ఎమ్ క్యూర్ సంస్థలకు కేంద్ర నిపుణుల కమిటీ అనుమతులు ఇచ్చింది.
హెచ్ఐవీ ప్రమాదం ఎక్కువ ఉన్న పెద్దలు, కౌమారదశలో ఉన్నవారికి ఈ ఇంజెక్షన్ వైరస్ బారిన పడకుండా రక్షణ కల్పిస్తుందని కమిటీ గుర్తించింది.
అమెరికా, బ్రిటన్ వంటి అగ్రదేశాలలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ ఔషధానికి, భారత్ లో సుదీర్ఘ క్లినికల్ ట్రయల్స్ లేకుండానే మార్కెట్లోకి తెచ్చేందుకు పచ్చజెండా ఊపారు.