
నిమ్మ రసంలో కంటే తొక్కలోనే ఎక్కువ విటమిన్ సి, పోషకాలు ఉంటాయని, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మ తొక్కలోని పెక్టిన్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, రక్తపోటు నియంత్రణకు, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఎండబెట్టిన నిమ్మ తొక్కలను నీటిలో మరిగించి గ్రీన్ టీ లాగా తాగడం వల్ల నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయని సూచించారు.