
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ సమీపంలో బైక్‌పై వెళ్తున్న పాల వ్యాపారి భుజంగరావుపై దుండగులు కత్తితో దాడి చేసి హత్య చేశారు.
దాడి సమయంలో 60 ఏళ్ల భుజంగరావు తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.