
బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్లోనూ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.