
వెంకటేశ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - AK 47’ చిత్రం వాయిదా పడింది.
ఈ నెల 9న విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్ల వాయిదా వేసినట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
రెండు మూడు వారాల తర్వాత సరైన తేదీ చూసుకుని కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.