
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా 21 మంది అంతర్జాతీయ మాజీ కెప్టెన్లు పాక్ ప్రధానికి లేఖ రాశారు.
కోర్టు ఆదేశించిన ప్రత్యేక వైద్య బోర్డుతో ఇమ్రాన్‌కు పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించాలని, కుటుంబ సభ్యులతో వారానికి ఒకసారి భేటీకి అనుమతించాలని వారు కోరారు.
ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారని, ఆయనకు సరైన వైద్య చికిత్స అందించడంలో జాప్యం జరుగుతోందని మాజీ క్రికెటర్లు లేఖలో పేర్కొన్నారు.