
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల యువత మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని నిర్ధారించిన న్యూ మెక్సికో కోర్టు, మెటాకు 567 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.
తీర్పు ప్రకారం 420 మిలియన్ డాలర్లను యువత చికిత్సా సేవల కోసం, మిగిలిన నిధులను ఐదేళ్ల పాటు అవగాహన మరియు నివారణ కార్యక్రమాల కోసం కేటాయించాలని ఆదేశించింది.
గత మార్చిలో మెటాపై 375 మిలియన్ డాలర్ల సివిల్ పెనాల్టీ విధించిన జ్యూరీ, తాజాగా జడ్జి బ్రయాన్ బీడ్షీడ్ నేతృత్వంలో ఈ రెండో దశ తీర్పును వెలువరించింది.