
టీమిండియా టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేసేందుకు ముంబైలోని వాసూ పరాంజపే క్రికెట్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
సూర్యకుమార్ 3 గంటల వ్యవధిలో 1000 బంతులను ఎదుర్కొని ప్రాక్టీస్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా అది వైరల్‌గా మారింది.
జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక కాకపోయినా, తన ఆటను మెరుగుపరుచుకుంటూ జట్టులోకి తిరిగి రావాలనే పట్టుదలతో ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు పేర్కొన్నారు.