ఒత్తిడి, డిప్రెషన్ వల్ల రాత్రి సమయంలో కూడా మెదడుకు విశ్రాంతి లభించకపోవడం వల్ల ఉదయం నీరసంగా అనిపిస్తుందని హెల్త్‌లైన్ తెలిపింది.
శరీరంలో విటమిన్ డి, ఐరన్, విటమిన్ బి 12 లోపిస్తే కణాలకు ఆక్సిజన్ అందక మేల్కొనే సమయానికి నీరసంగా ఉంటుంది.
పడుకునే ముందు ఫోన్ చూడటం, ఆల్కాహాల్ తాగడం, ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కూడా నిద్ర నాణ్యత దెబ్బతింటుంది.