
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ టెస్టు క్రికెట్‌లో 435 వికెట్లు తీసి, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (434) రికార్డును అధిగమించి ఆరో స్థానానికి చేరుకున్నాడు.
డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో లిట్టన్ దాస్ వికెట్ తీయడం ద్వారా స్టార్క్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసి, ఆస్ట్రేలియాపై 153 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.