
అమెరికాకు చెందిన బోయింగ్ సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానం మంగళవారం ఉదయం 10.00 గంటలకు రష్యాలోని నుకోవో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది.
ఆర్‌సీహెచ్4555, 07-7181 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఈ విమానం లాట్వియా నుంచి బయలుదేరి మాస్కోకు చేరుకున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ద్వారా వెల్లడైంది.
ఈ విమానంలో ఉన్న వ్యక్తులు లేదా సామగ్రిపై స్పష్టత లేదని రష్యా వర్గాలు పేర్కొనగా, అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.