
కృత్రిమ మేధ (AI) వల్ల భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉద్యోగాలు పోయే ముప్పు 4.5 శాతంగా మాత్రమే ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో 18.7 శాతం ఉద్యోగాల్లో ఉత్పాదకత పెరిగే అవకాశం ఉండగా, భారత్లో ఈ మార్పులు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తాయి.
భారత్లో ఇప్పటికే ఐదుగురికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో 20 శాతం ఏఐ చాట్బాట్లను వినియోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.