
తొమ్మిదేళ్లుగా దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న బంగ్లాదేశీ ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి రూ. 8 లక్షల విలువైన 73.5 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి, ఐఫోన్లు, ఐప్యాడ్ స్వాధీనం చేసుకున్నారు.
వీరు జూలై 11న భారత్‌లోకి ప్రవేశించి, పగటిపూట వస్తువులు అమ్ముతూ రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.