
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా మరోసారి క్షిపణులతో దాడి చేయగా, పలు నివాస గృహాలు దెబ్బతిని ఆరుగురు గాయపడ్డారని నగర మేయర్ విటాలీ క్లిట్ష్కో వెల్లడించారు.
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా ప్రత్యేక ప్రతినిధులు సమావేశమై చర్చలు జరిపారని, నవంబర్ 10న అబుదాబిలో తదుపరి చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న ముందువరుస రేఖ వెంబడే పోరాటాన్ని నిలిపివేసే ఒప్పందానికి తాము సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.