
స్మార్ట్ఫోన్ను ఛార్జ్ చేస్తున్నప్పుడు గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం, సోషల్ మీడియా వాడటం వంటివి బ్యాటరీ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
మంచం, సోఫా, పరుపు లేదా దిండు కింద పెట్టి ఛార్జ్ చేయడం వల్ల ఫోన్ వేడెక్కి బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుంది.
ఫోన్ కింద పడితే పగిలిపోకుండా ఉండేందుకు వాడే మందపాటి బ్యాక్ కేస్లు వేడి బయటకు పోకుండా అడ్డుకుంటాయి. అలాగే, తక్కువ నాణ్యత గల ఛార్జర్లను వాడటం కూడా సమస్యలను సృష్టిస్తుంది.