
సోమవారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతుండగా, ఓ దశలో సెన్సెక్స్ 1000 పాయింట్లు ఎగబాకింది.
ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో ముడి చమురు ధరలు దిగిరావడంతో సూచీలు లాభపడ్డాయి.
ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 943 పాయింట్ల లాభంతో 75,388 వద్ద, నిఫ్టీ 257 పాయింట్లు పెరిగి 23,305 వద్ద కదలాడాయి.