
విమానం రద్దు కావడంతో యూఏఈలో హోటల్ వసతి కోరిన పాకిస్థానీ ప్రయాణికుల పట్ల అక్కడి యాజమాన్యం వివక్ష చూపిందని పాక్ ఎంపీ అసద్ ఖైసర్ ఆరోపించారు.
పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఎంపీ అసద్ ఖైసర్, హోటల్ సిబ్బంది కేవలం భారతీయులు, అమెరికన్లకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.
విమాన రద్దు వంటి అత్యవసర సమయాల్లో కూడా పాక్ పౌరులను కాదని భారతీయులకు ప్రాధాన్యత ఇవ్వడంపై పాకిస్థాన్ పార్లమెంటులో తీవ్ర చర్చ నడిచింది.