
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ సుప్రీంకోర్టు అనుమతిని మంజూరు చేసింది.
గతంలో హైకోర్టు తీర్పులను దాచిపెట్టి స్టేటస్ కో పొందారని, ఇప్పుడు వాస్తవాలు తెలియడంతో పిటిషనర్ జడ శ్రావణ్ కుమార్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు.
సుమారు 90 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వ స్థలంలోనే ఆలయాన్ని నిర్మిస్తున్నామని, నవంబర్ నెలాఖరు నాటికి నాలుగు సెంట్ల స్థలంలో రామాలయ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు.