
సంగీత దర్శకుడు ఇళయరాజాపై కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆరోపణలతో సరిగమ ఇండియా లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.
హక్కులు ఉన్న పాటలను థర్డ్ పార్టీకి విక్రయించడమే కాకుండా, స్పాటిఫై, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో నిబంధనలు అతిక్రమించారని సరిగమ ఆరోపించింది.
ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు ఇళయరాజాకు నోటీసులు జారీ చేయగా, సరిగమ ఆయన ఆస్తుల జప్తు మరియు జైలు శిక్ష విధించాలని కోరింది.