బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు కెనరా బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ (MCLR) రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
ఈ కొత్త వడ్డీ రేట్లు 2026, ఆగస్ట్ 12 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకులు స్పష్టం చేశాయి.
కెనరా బ్యాంకులో ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.80 శాతానికి పెరగగా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇది గరిష్ఠంగా 8.75 శాతానికి చేరింది.