
ఈ పండుగ సీజన్లో ఆన్లైన్ షాపింగ్‌కు పెరగనున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్లిప్‌కార్ట్ కొత్త ఉద్యోగాలను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం 2.5 లక్షల మందికి కొత్తగా తాత్కాలిక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు ఈ-కామర్స్ సంస్థ వెల్లడించింది.
ఈ ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాల్లో దాదాపు 75,000 మంది తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెడుతున్నవారేనని తెలిపింది.