
తాలిబన్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అఫ్గానిస్థాన్లో 26 లక్షల మందికి పైగా బాలికలు మాధ్యమిక విద్యకు దూరమయ్యారని యునిసెఫ్ నివేదించింది.
ఆఫ్గాన్లో 2021 సెప్టెంబర్ నుంచి ఆరో తరగతి తర్వాత బాలికల చదువుపై నిషేధం కొనసాగుతుండగా, యూనివర్సిటీలపై కూడా ఆంక్షలు విధించారు.
ఈ విద్యాపరమైన ఆంక్షల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు భవిష్యత్ తరాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.