
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా, ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
వ్యవసాయం, ఆగ్రో కెమికల్స్, ఫార్మా, ఫిన్‌టెక్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు.
కాకినాడలో గ్రీన్ అమ్మోనియా కేంద్రం ఏర్పాటుకు నార్వేకు చెందిన యారా ఇంటర్నేషనల్‌ను ఆహ్వానించారు.