
సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించి, ఇది పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు వంటివని విమర్శించిన సీఎం, 3.48 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.
తెలంగాణను వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని, 2034 వరకు ప్రజల ఆశీర్వాదం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.