
తెలంగాణ మంత్రివర్గం ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థలాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో 'ఇన్వెస్ట్ తెలంగాణ' థీమ్‌తో 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0'ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారులకు పథకాలు అందేలా చూడాలని, ఫ్యూచర్ సిటీ ప్లాన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేశారు.