ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.6 డిగ్రీల సెంటీగ్రేడ్ అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గత 150 ఏళ్ల చరిత్రలో ఇది అత్యంత ప్రమాదకరమైన రికార్డు అని, 1877 నాటి 2.75 డిగ్రీల రికార్డును కూడా ఇది దాటేస్తుందని అధికారులు పేర్కొన్నారు.
దీనివల్ల భారత్లో రుతుపవనాలు బలహీనపడి, వర్షపాతం సాధారణం కంటే 25 శాతం తగ్గే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.