
కొత్తిమీర జ్యూస్‌లో విటమిన్ కె, ఇ, ఎ లు సమృద్ధిగా ఉండటం వల్ల చర్మం మెరుస్తూ, జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
పరగడుపున ఈ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.