
విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ అధికారులు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజీలతో దర్యాప్తును వేగవంతం చేశారు.
మే 6న మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు సాయికృష్ణను తరలించినప్పటి పరిణామాలపై దృష్టి సారించిన అధికారులు, నలుగురు నిందితులను విచారిస్తున్నారు.
నిందితుల కస్టడీ నేటితో ముగియనుండటంతో, వారిని న్యాయాధికారి శ్రీకాంత్ ఎదుట హాజరుపరిచి తదుపరి విచారణ కోసం జైలుకు తరలించే అవకాశం ఉంది.