
భారత్‌తో తొలి వన్డే నేపథ్యంలో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మీడియాతో మాట్లాడుతూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల బ్యాటింగ్ శైలిని ప్రశంసించారు.
పిచ్ స్వభావాన్ని బట్టే తమ బౌలర్లను ఎంపిక చేసుకుంటామని, రో-కోల కోసం ప్రత్యేకంగా ఇప్పుడే ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదని ఆయన తెలిపారు.
ఒకవేళ టీమిండియా టాప్ ఆర్డర్ నుంచి తన జట్టులోకి ఒక ఆటగాడిని ఎంచుకునే అవకాశం ఉంటే శుభ్‌మన్ గిల్‌ను తీసుకుంటానని సాంట్నర్ చెప్పారు.