
ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా వాహనాల రిటెయిల్ అమ్మకాలు 17.51 శాతం పెరిగి 24,23,201 యూనిట్లుగా నమోదైనట్లు ఫాడా (FADA) వెల్లడించింది.
గతేడాది ఆగస్టులో 20,62,038 వాహనాలు అమ్ముడవ్వగా, ఈసారి జీఎస్టీ రేట్ల ప్రభావం మరియు పండగ సీజన్ కారణంగా అమ్మకాలు పుంజుకున్నాయని ఫాడా తెలిపింది.
దేశ చరిత్రలో తొలిసారిగా ప్యాసింజర్ వాహనాల విభాగంలో పెట్రోల్ వాహనాల వాటా (40.85%) కంటే ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వాటా (41.95%) ఎక్కువగా నమోదైంది.