
ఒకప్పుడు కేవలం రూ. 8 విలువ చేసే అమెరికాకు చెందిన అరుదైన '1894-ఎస్ బార్బర్ డైమ్' నాణెం భారీ ధరకు అమ్ముడుపోయింది.
సెప్టెంబర్ 1న నిర్వహించిన వేలంలో ఈ పురాతన నాణెం ఏకంగా 1,250,500 డాలర్లకు (సుమారు రూ. 10.4 కోట్లు) అమ్ముడైంది.
శాన్ ఫ్రాన్సిస్కో మింట్ కేవలం 24 నాణేలను మాత్రమే ముద్రించగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 9 మాత్రమే మిగిలి ఉండటంతో దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.