
తెలంగాణలో నిషేధిత 22ఏ జాబితాలో ఉన్న భూముల సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని 3 వేల చదరపు మీటర్ల స్థలంపై నిషేధం తొలగించగా, కూకట్‌పల్లిలో 300 ప్లాట్లను జాబితా నుంచి తొలగించారు.
సమస్య పరిష్కారమైన చోట సబ్ రిజిస్ట్రార్లు దరఖాస్తుదారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.