
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో రెవెన్యూ అధికారులు చేపట్టిన భూముల రీ-సర్వేను వెంకటాపూర్ గ్రామస్థులు అడ్డుకున్నారు.
తమ గ్రామానికి చెందిన 113 ఎకరాల భూమిని ఎర్రవల్లి గ్రామ రికార్డుల్లో నమోదు చేశారని వారు మర్కూక్ తహశీల్దార్ సరితకు వినతిపత్రం సమర్పించారు.
క్షేత్రస్థాయిలో సర్వే చేసి హద్దులు నిర్ధారించిన తర్వాతే ఇతర సర్వేలు చేయాలని కోరుతూ గ్రామస్థులు జిల్లా ఇన్‌చార్జి మంత్రిని, అడిషనల్ కలెక్టర్లను కలిసి విజ్ఞప్తి చేశారు.