
దులీప్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో వైభవ్ తన అసాధారణ బ్యాటింగ్ ప్రతిభతో పాటు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాల్సి ఉంది.
జింబాబ్వే సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన వైభవ్, అతి చిన్న వయసులోనే దేశవాళీ క్రికెట్‌లో ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.