
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మగురా పట్టణంలోని ఇంటిపై బుధవారం రాత్రి 8.45 గంటలకు గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు.
భారతదేశంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో షకీబ్ పాల్గొన్న కొద్దిసేపటికే ఈ దాడి జరగడం గమనార్హం.
ఈ ఘటనపై అవామీ లీగ్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేయగా, భద్రతా సంస్థలు దాడికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించాయి.