
విద్యార్థుల ఆలోచన శక్తిపై ప్రభావం చూపుతుందనే ఆందోళనతో న్యూయార్క్ నగరంలోని ఎలిమెంటరీ, మిడిల్ స్కూళ్లలో ఏఐ (AI) వినియోగాన్ని మేయర్ తాత్కాలికంగా నిషేధించారు.
3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు రోజుకు 30 నిమిషాలు, 6 నుంచి 8 తరగతుల వారికి 45 నిమిషాల చొప్పున స్క్రీన్ టైమ్ పరిమితిని ప్రభుత్వం విధించింది.
అదే సమయంలో, హైస్కూల్ విద్యార్థుల కోసం టీచర్ల పర్యవేక్షణలో సంవత్సరానికి రెండుసార్లు ఏఐ లిటరసీ తరగతులను నిర్వహించేందుకు పైలట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నారు.