
హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎన్ జరిపిన అధ్యయనంలో 55-85 ఏళ్ల వృద్ధుల్లో 36.4% మంది జ్ఞాపకశక్తి తగ్గే సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది.
శరీరంలో విటమిన్ డి, బి-కాంప్లెక్స్ లోపాలు ఉండటం వల్ల మెదడు పనితీరు మందగిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు, బీపీ కూడా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది.