
అమెరికాలోని టస్కన్‌లో తన గర్ల్‌ఫ్రెండ్ జులిస్సా రూబీ సలజార్‌ను హత్య చేసిన కేసులో వరుణ్ బచ్చిగారి అనే భారతీయ యువకుడిని జర్మనీ పోలీసులు బెర్లిన్‌లో అరెస్టు చేశారు.
అరిజోనా వర్సిటీలో బిజినెస్ అనలిటిక్స్ చదువుతున్న వరుణ్, ఆగస్టు 6న జరిగిన హత్య తర్వాత జర్మనీకి పారిపోయాడు.
అమెరికా పోలీసులు జారీ చేసిన వారెంట్ ఆధారంగా జర్మనీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడుతున్నారు.