
ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో భారత్ ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉండగా, వెల్లింగ్టన్లో జరిగే మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
తొలి రెండు మ్యాచ్లకు దూరమైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా మూడో మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండటం లేదు.
వెల్లింగ్టన్ మైదానం పేసర్లకు స్వర్గధామం కావడంతో పాటు రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో తుది జట్టులో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.