
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ విధానాన్ని సమర్థించుకుంటూ, దిగుమతి సుంకాల వల్లే దేశం ధనిక దేశంగా మారిందని పేర్కొన్నారు.
విదేశీ కార్ల తయారీ సంస్థలు అమెరికాలో ఫ్యాక్టరీలు నిర్మించాలని, లేని పక్షంలో 25 శాతం సుంకం చెల్లించాలని ఆయన హెచ్చరించారు.
ఈ విధానాల వల్ల దేశంలో 19.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఉద్యోగ అవకాశాలు పెరిగాయని ట్రంప్ తెలిపారు.