
పాకిస్తాన్, శ్రీలంకతో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం 18 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు.
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత లెగ్ స్పిన్నర్ మేసన్ క్రేన్‌కు సెలక్టర్లు మళ్లీ జట్టులో చోటు కల్పించారు.
అక్టోబర్ 9 నుంచి పాక్ వేదికగా ప్రారంభం కానున్న ఈ సిరీస్ వన్డే వరల్డ్‌కప్-2027 సన్నాహకాల్లో భాగంగా నిర్వహించబడుతోంది.