ఫోన్‌పే యాప్‌లో శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు భాగస్వామ్యంతో రోజుకు రూ. 100 నుంచి రూ. 1000 వరకు పెట్టుబడి పెట్టే డైలీ ఆర్డీ సేవలను ప్రారంభించారు.
వినియోగదారులు వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ఎఫ్డీలను పోల్చి చూసి పెట్టుబడి పెట్టే సౌకర్యాన్ని కల్పించగా, డిపాజిట్లపై రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది.
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ప్రస్తుతం డిపాజిట్లపై 6 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.