వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.
మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడైన సర్వోత్తమ్‌రెడ్డికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి.
వివిధ అభ్యర్థులపై పార్టీ సర్వే నిర్వహించిన అనంతరం అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వెల్లడైంది.